ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ ఇంజనీరింగ్ నిపుణులకు భారీ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తోంది. అడ్వర్టైజ్మెంట్ నంబర్ 10/26 ద్వారా మొత్తం 135 డిప్యూటీ మేనేజర్ (E-4 గ్రేడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం ఎలక్ట్రికల్,మెకానికల్,కంట్రోల్ & ఇన్స్ట్రుమెంటేషన్ (C&I) విభాగాల్లో అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి నెలకు రూ. 70వేల నుంచి రూ.2లక్షల వరకు జీతం అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
NTPC డిప్యూటీ మేనేజర్ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు:
ఖాళీల వివరాలు:
మొత్తం: 135 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్): 40
డిప్యూటీ మేనేజర్ (మెకానికల్): 55
డిప్యూటీ మేనేజర్ (C&I): 40
అర్హతలు & వయోపరిమితి:
సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో ఫుల్-టైమ్ బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి (SC/ST/PwBD అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది). దీంతో పాటు పవర్ సెక్టార్ (కోల్, గ్యాస్ లేదా లిగ్నైట్) లో కనీసం 10 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ అనుభవం ఉండాలి.ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు అనుభవంలో 2 ఏళ్ల సడలింపు ఉంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలుగా నిర్ణయించారు.
జీతం వివరాలు:
ఈ పోస్టులు E-4 గ్రేడ్ కిందకు వస్తాయి. పే స్కేల్ నెలకి రూ. 70,000 నుంచి రూ. 2,00,000 (IDA) వరకు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్,ఓబీసీ.ఈడబ్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500 కాగా.. ఇతరులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజును SBI ఆఫ్‌లైన్ పే-ఇన్-స్లిప్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో కానీ చెల్లించవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
వచ్చిన అప్లికేషన్ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆపై కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు & అప్లికేషన్ విధానం:
ఆన్లైన్ అప్లికేషన్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు26. కాబట్టి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ careers.ntpc.co.in లేదా www.ntpc.co.in ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.





