HomeADMISSIONSజేఈఈ మెయిన్, యూజీసీ నెట్ పరీక్షల తేదీలు విడుదల!

జేఈఈ మెయిన్, యూజీసీ నెట్ పరీక్షల తేదీలు విడుదల!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల తాత్కాలిక క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు జరిగే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. జేఈఈ మెయిన్, యూజీసీ నెట్, సీయూఈటీ పీజీ, సీఎంఏటీ వంటి ప్రధాన పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ షెడ్యూల్ ద్వారా తమ ప్రిపరేషన్ను మరింత పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. పరీక్షల తేదీలకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పరీక్షల షెడ్యూల్ :

జేఈఈ మెయిన్ (JEE Main) 2027 సెషన్-1: ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం ఈ పరీక్షలను జనవరి 22 నుంచి 24 వరకు, అలాగే జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. జనవరి 31ని బఫర్ డేగా ఉంచారు.

యూజీసీ నెట్ (UGC-NET) డిసెంబర్: డిసెంబర్ 14 నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. డిసెంబర్ 20, 21 తేదీలను బఫర్ రోజులుగా కేటాయించారు.

జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్: ఈ ఎగ్జామ్‌ను డిసెంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు.

నిఫ్ట్ (NIFT) & సీఎంఏటీ (CMAT): ఫ్యాషన్ డిజైనింగ్ ప్రవేశ పరీక్ష నిఫ్ట్ జనవరి 10న, మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ సీఎంఏటీ ఫిబ్రవరి 7న జరగనున్నాయి.

సీయూఈటీ పీజీ (CUET PG): పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం మార్చి 1 నుంచి 25 మధ్య వివిధ తేదీల్లో ఈ పరీక్షలు ఉండబోతున్నాయి.

గమనించాల్సిన విషయం:
ప్రస్తుతం విడుదల చేసిన ఈ తేదీలు అన్నీ తాత్కాలికమైనవే అని NTA స్పష్టం చేసింది. అడ్మినిస్ట్రేటివ్ లేదా లాజిస్టికల్ రీసెంట్స్ వల్ల భవిష్యత్తులో ఈ తేదీల్లో చిన్నపాటి మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి విద్యార్థులు ఎప్పటికప్పుడు NTA అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేస్తూ లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకోవడం మంచిది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here