తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TSWREIS) ఆధ్వర్యంలో.. నడిచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్ల కోసం.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TGCET) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నాణ్యమైన విద్యను అందించే.. ఈ గురుకులాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. జనవరి 21 వరకు ప్రవేశ పరీక్ష కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాలు:
విద్యా సంవత్సరం- 2026-27
అడ్మిషన్స్- 5 నుంచి 9వ తరగతి
ప్రవేశ పరీక్ష పేరు- తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGCET)
అప్లికేషన్లకు చివరి తేదీ- జనవరి 21 వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్ష తేదీ:
ఫిబ్రవరి 22 (ఆదివారం), 2026 న ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
ప్రవేశం కల్పించే విద్యా సంస్థలు: ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కింది సంక్షేమ శాఖల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
TSWREIS – తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
TTWREIS(ST) – తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
MJPTBCWREIS – మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ.
TGREIS – తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ
వెబ్‌సైట్: మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgcet.cgg.gov.in ను సందర్శించవచ్చు.
ఆయా సంక్షేమ శాఖల వెబ్‌సైట్లలో కూడా పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
సంప్రదింపు వివరాలు (అదనపు సమాచారం కోసం):
నోటిఫికేషన్, అప్లికేషన్ సంబంధించిన సందేహాలు లేదా అదనపు సమాచారం కోసం అభ్యర్థులు కింది ఫోన్ నంబర్లలో ఆయా గురుకుల సంస్థలను సంప్రదించవచ్చు.
TSWREIS (SC)-040-23391598
TTWREIS (ST)- 8333800221
MJPTBCWREIS (BC)- 040-23328266
TGREIS(GEN)040-24734899





