HomeJOBSహైదరాబాద్ ఈసీఐల్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

హైదరాబాద్ ఈసీఐల్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

అణుశక్తి విభాగం (DAE) కింద పనిచేసే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL).. 96 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ సహా వివిధ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించే ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నియామక ప్రక్రియ దేశంలోని ఐదు జోన్లలో (హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌తో సహా) జరుగుతుంది. డిప్లొమా, బీఈ/బీటెక్ లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులుఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:
ఈ నియామకంలో మొత్తం 96 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు:

ప్రాజెక్ట్ ఇంజినీర్

టెక్నికల్ ఆఫీసర్

అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్

సీనియర్ ఆర్టీజన్

జూనియర్ ఆర్టీజన్

జోన్ల వారీగా ఖాళీలు:

న్యూ ఢిల్లీ (నార్త్ జోన్): 27

ముంబై (వెస్ట్ జోన్): 28

బెంగళూరు, చెన్నై (సౌత్ జోన్): 11

కోల్‌కతా (ఈస్ట్ జోన్): 02

హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్: 24

అర్హత ప్రమాణాలు:
అభ్యర్థులు కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్ లేదా ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటు ఆయా పోస్టులకు సంబంధించిన పని అనుభవం తప్పనిసరి.

వయస్సు:
ప్రాజెక్ట్ ఇంజినీర్ , ఇతర అన్ని పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:
ఎంపిక పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 2025 అక్టోబర్ 15, 16, 17, 18

ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశాలు:

జోనల్ ఆఫీస్‌లు: కోల్‌కతా, న్యూ ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలోని ECIL జోనల్ ఆఫీస్‌లు.

హైదరాబాద్: పీఎల్డీసీ, నలందా కాంప్లెక్స్, టీఐఎస్ఆర్ రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్.

అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీల్లో తమ డాక్యుమెంట్స్‌తో పాటు నేరుగా ఆఫీసుకు హాజరుకావాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here