బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) భారీగా ఉద్యోగాల భర్తీని చేపట్టింది. ఈ మేరకు బ్యాంక్ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,172 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి 2 వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల కాగా.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు 136.. ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు) ఉద్యోగాలు మరో 1036 ఉన్నాయి.
స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు: ఈ విభాగంలో మొత్తం 136 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 84 మేనేజర్ పోస్టులు, 46 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 6 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
బ్యాంక్ అధికారిక వెబ్ సైట్: https://www.idbibank.in/
ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు) ఉద్యోగాలు: ఈ విభాగంలో మొత్తం 1036 ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 24న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపకైన అభ్యర్థులు ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. అనంతరం వారి పనితీరు ఆధారంగా సర్వీసు పొడిగింపు ఉంటుంది.