HomeJOBSహార్టికల్చరల్ యూనివర్సిటీలో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హార్టికల్చరల్ యూనివర్సిటీలో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTGHU).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 61 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ విభాగాల్లో పీహెచ్‌డీ ఉండి, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 31 లోపు ఆఫ్‌ లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు: 61

అసోసియేట్ ప్రొఫెసర్: 44 పోస్టులు

ప్రొఫెసర్: 17 పోస్టులు

విభాగాలు :

అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రోనమీ, బయోకెమిస్ట్రీ, క్రాప్ ఫిజియోలజీ, ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ, ఫ్రూట్ సైన్స్, వెజిటేబుల్స్, ఫ్లోరికల్చర్, ఇతర సంబంధిత హార్టికల్చర్ విభాగాలు.

అర్హతలు:

సంబంధిత సబ్జెక్టులో పీజీ (PG), పీహెచ్‌డీ (Ph.D) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్థులకు బోధన లేదా పరిశోధన అనుభవం ఉండాలి.

జాతీయ స్థాయి అర్హత పరీక్షలలో ఉత్తీర్ణత, పబ్లికేషన్స్ అదనపు అర్హతలుగా పరిగణిస్తారు.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు యూజీసీ (UGC) స్కేల్ ప్రకారం జీతం లభిస్తుంది.

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ. 1,31,400 నుంచి రూ. 2,17,100 వరకు జీతం ఉంటుంది.

ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం:

API (Academic Performance Indicator): అకడమిక్ రికార్డుల పరిశీలిస్తారు.

PBAS (Performance Based Appraisal System): గత పని తీరు ఆధారంగా స్కోరు ఇస్తారు

ఇంటర్వ్యూ: అకడమిక్ స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన వారికి ములుగు క్యాంపస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 4000, ఎస్సీ , ఎస్టీ, దివ్యాంగులు రూ. 2500 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీ:

అప్లికేషన్లకు చివరి తేదీ: జనవరి 31వ తేదీలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ విధానం:

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

పూర్తి చేసిన ఫారమ్‌కు అవసరమైన డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్ జత చేయాలి.

అప్లికేషన్ ఫీజు కోసం డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయాలి.

పూర్తి చేసిన సెట్‌ను “రిజిస్ట్రార్ ఆఫీస్, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ, ములుగు, సిద్దిపేట జిల్లా” చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://skltghu.ac.in/ సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here