Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎల్‌ఐసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్​

ఎల్‌ఐసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్​

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 జేఏ ఖాళీలున్నాయి.

అర్హత: కనీస 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ సిస్టమ్స్‌ ఆపరేటింగ్, వర్కింగ్ నాలెడ్జ్‌ తప్పనిసరి. వయసు 21 నుంచి -28 సంవత్సరాల మధ్య ఉండాలి. పని ప్రదేశం ఆధారంగా నెలకు రూ.32,000 నుంచి రూ.35,200 ఉంటుంది.

సెలెక్షన్​: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఇంగ్లీష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), లాజికల్ రీజనింగ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్ స్కిల్ (40 ప్రశ్నలు- 40) మార్కులు).

అప్లికేషన్స్​: అభ్యర్థులు ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్​లో నిర్వహిస్తారు. వివరాలకు www.lichousing.com వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!