ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వరంగ సంస్థకు చెందిన హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈపోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కావాలసిన అర్హతల గురించి తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు:
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైయినీ 12పోస్టులు
- టెక్నీషియన్ సి 17 పోస్టులు
- జూనియర్ అసిస్టెంట్ 03 పోస్టులు
మొత్తం పోస్టులు 32
అర్హతలు:
ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతభత్యాలు:
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుకు రూ. 24,500, రూ. 90,000. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 21, 500, నుంచి రూ. 82,000 వరకు చెల్లిస్తారు.
వయస్సు:
వయస్సు 28ఏండ్లు మించి ఉండకూడదు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 250, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజులో మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్ట్, వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తులు ఆన్ లైన్ విధానం ద్వారా చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 11 జులై 2024.