హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 2024–-25 విద్యా సంవత్సరానికి జేఎన్ఏఎఫ్ఏయూ, అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాంలలో అడ్మిషన్స్‌కు ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఏడీఈఈ)ని నిర్వహిస్తోంది.
కోర్సులు:
బీఎఫ్ఏ(అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్) కోర్సులో 50 సీట్లు, బీఎఫ్ఏ(పెయింటింగ్): 35, బీఎఫ్ఏ(స్కల్ప్చర్): 20, బీఎఫ్ఏ (యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్): 60, బీఎఫ్ఏ(ఫొటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్): 50, బీడిజైన్(ఇంటీరియర్ డిజైన్): 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు డ్యురేషన్ నాలుగేళ్లు ఉండాలి.
అర్హత:
ఇంటర్మీడియట్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. ఎంట్రెన్స్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు జులై 4వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్ ఎగ్జామ్ జులై 20న నిర్వహిస్తారు. వివరాలకు www.jnafauadmissions.com వెబ్సైట్లో సంప్రదించాలి.