సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్ & నాన్ ఇంజినీరింగ్), డిప్లొమా పూర్తి చేసిన వారి నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2021, 2022, 2023, 2024 & 2025 విద్యాసంవత్సరాల్లో వివిధ కోర్సులు చేసిన వారు అప్రెంటిస్ ఫిప్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 525 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు : 525
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ (225 ఖాళీలు):
మైనింగ్: 60
ఈఈఈ: 45
ఈసీఈ: 20
సిఎస్ఈ: 20
ఐటి: 15
మెకానికల్: 45
సివిల్: 20
(7 ఇంజినీరింగ్ బ్యాచ్‌లు)
నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ (200 ఖాళీలు):
బీఎ: 60
బీఎస్సీ: 60
బీకాం: 60
బీబీఏ: 5
బీసీఎ: 5
బి-ఫార్మసీ: 10
(6 నాన్-ఇంజినీరింగ్ బ్యాచ్‌లు)
డిప్లొమా హోల్డర్స్ (100 ఖాళీలు):
మైనింగ్: 30
ఈఈఈ: 25
మెకానికల్: 25
సివిల్: 20
(4 ఇంజినీరింగ్ బ్యాచ్‌లు)
అప్లికేషన్ విధానం:
1. అభ్యర్థులు ముందుగా ఆగస్టు 8 వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు సింగరేణి వెబ్ పోర్టల్ లేదా www.nats.education.gov.in (NATS 2.0)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
2. ఆగస్టు 11 వ తేదీ సాయంత్రం 3:00 గంటలలోపు www.scclmines.com/apprenticeship వెబ్ పోర్టల్‌లో అప్లై చేసుకుని, అప్లికేషన్ ప్రింట్ తీసుకుని సమీపంలోని మైన్స్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (MVTC)లో సమర్పించాలి.
అర్హత:
వయస్సు : 18 నుంచి 28 సంవత్సరాల మధ్య (జులై 31, 2025 నాటికి) ఉండాలి.
(ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 33 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది)
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్( www.scclmines.com/apprenticeship ) సంప్రదించవచ్చు.





