తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ (Planning Department) లో ఖాళీగా ఉన్న 166 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ స్థాయిల్లోని ఈ ఉద్యోగాల భర్తీతో ప్లానింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు- 166
డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ (Deputy Statistical Officer): 64 పోస్టులు
చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (Chief Planning Officer): 12 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్ (Assistant Director): 12 పోస్టులు
స్టాటిస్టికల్ ఆఫీసర్ (Statistical Officer): 46 పోస్టులు
సూపరింటెండెంట్ (Superintendent): 5 పోస్టులు
సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ (Senior Assistant/Accountant): 4 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant): 23 పోస్టులు
ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో.. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లేదా సంబంధిత నియామక సంస్థ నుంచి అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, వయో పరిమితి, అప్లికేషన్ ప్రక్రియ, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు వంటి పూర్తి వివరాలు ఉంటాయి.