సౌత్ ఈస్టర్న్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ( గూడ్స్ గార్డ్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్పీఎఫ్/ ఆర్పీఎస్ఎఫ్ అసిస్టెంట్లు, సిబ్బంది, క్యాటరింగ్ ఏజెంట్లు, జనరల్ డిపార్ట్‌మెంట్ కాంపిటీటివ్ మినహా సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అన్ని అర్హత గల రెగ్యులర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు: మొత్తం 1202 పోస్టుల్లో అసిస్టెంట్ లోకో పైలట్ 827, రైలు మేనేజర్ ( గూడ్స్ గార్డ్ ) -375 ఖాళీలు ఉన్నాయి.
అసిస్టెంట్ లోకో పైలట్ : ఆర్మేచర్ & కాయిల్ వార్డర్ /ఎలక్ట్రీషియన్/ మెకానిక్/ ఫిట్టర్/ హీట్ ఇంజన్ /ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్/ ఇతర ట్రేడ్ మెట్రిక్యులేషన్ / sslc ప్లస్ ఐటీఐ లేదా గుర్తింపు పొందిన ఎన్‌సివిఎస్‌విటి ఎన్‌సివిటిటి/ సంవత్సరం డిప్లొమా సంస్థల నుంచి ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
రైలు మేనేజర్: డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉంటే సరిపోతుంది. వయసు అన్ రిజర్డ్వ్ 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 45 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు18 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి.