ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 1501 ఖాళీలున్నాయి.
పోస్టులు:
ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్,
కంప్రెసర్ అటెండెంట్,
బ్రాస్ ఫినిషర్,
కంపోజిట్ వెల్డర్,
ఎలక్ట్రికల్ క్రేన్ ఆపరేటర్స్,
ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్,
జూనియర్ క్యూసీ ఇన్‌స్పెక్టర్,
జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్,
ప్లానర్ ఎస్టిమేటర్,
గ్యాస్ కట్టర్,
స్టోర్స్ కీపర్,
ఫైర్ ఫైటర్,
ఫిట్టర్,
పైప్ ఫిట్టర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత కాంపిటెన్సీ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. 1 జనవరి 2022 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం, ట్రేడ్/ స్కిల్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్: రాత పరీక్ష మొత్తం 30 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు, టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశల చొప్పున మొత్తం 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 8 ఫిబ్రవరి
ఎగ్జామ్: 15 మార్చి
వెబ్సైట్: www.mazagondock.in