వైద్య విద్య యూజీ కోర్సుల్లో చేరేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష రాసేందుకు వయోపరిమితిని తొలగిస్తూ జాతీయ వైద్య మండలి ‘ఎన్ఎంసీ’ ప్రకటన విడుదల చేసింది. గతంలో నీట్ రాసేందుకు 17ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులను మాత్రమే అర్హులుగా తీసుకునేవారు. అయితే పలు అభ్యంతరాలు, సలహాలు, సూచనల మేరకు ఎన్ఎంసీ సమావేశమై వయసు నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎన్ని సార్లయిన నీట్ పరీక్ష రాసేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు తర్వలోనే జీవో చేయనున్నట్టు జాతీయ వైద్య మండలి వెల్లడించింది.