ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు ప్రతి నెలా రూ.1000 స్కాలర్షిప్ అందుకునే బంపర్ ఆఫర్… నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్. జాతీయ స్థాయిలో నిర్వహించే టెస్ట్‌లో వచ్చే మార్కుల మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, రెసిడెన్షియల్, కేంద్రీయ విద్యాలయాల్లో 8వ తరగతి చదివే విద్యార్థులందరూ ఈ టెస్ట్ రాసేందుకు అర్హులే.
స్కాలర్ షిప్; ఏడాదికి రూ. 12 వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు.
అర్హతలు: ఏడో తరగతిలో జనరల్/ఓబీసీ అయితే కనీసం 55 శాతం, ఎస్సీ/ఎస్టీ అయితే 50 శాతం మార్కులు సాధించి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.15 లక్షల లోపు ఉండాలి. కరోనా కారణంగా నిరుటి పరీక్షలు జరుగకపోతే.. 6వ తరగతిలో వచ్చిన మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు.
ఫీజు: జనరల్/ఓబీసీ అయితే రూ.100, ఎస్సీ/ఎస్టీ అయితే రూ.50 చెల్లించాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్; పేపర్–-1లో స్టూడెంట్ మెంటల్ ఎబిలిటి సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. పేపర్– 2లో 7, 8 వ తరగతుల్లోని మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 20 నవంబర్ 2020
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష తేది : 2020 డిసెంబర్ 12, 13 తేదీల్లో
వెబ్‌సైట్: http://bse.telangana.gov.in/
8వ తరగతి విద్యార్థులకు బంపర్ ఛాన్స్… నేషనల్ మీన్స్ స్కాలర్ షిప్ టెస్ట్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS