Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSహైదరాబాద్​ ఎన్‌ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ పోస్టులు​

హైదరాబాద్​ ఎన్‌ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ పోస్టులు​

హైదరాబాద్​ మసాబ్‌ట్యాంక్‌లోని నేషనల్‌ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్​ఎండీసీ) ఖాళీగా ఉన్న 153 జూనియర్ ఆఫీసర్ పోస్టుల పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతుంది.

ఖాళీలు: కమర్షియల్-4; ఎన్విరాన్‌మెంట్-1; జియో అండ్ క్వాలిటీ కంట్రోల్-3; మైనింగ్‌- 56; సర్వే-9; కెమికల్- 04; సివిల్-09; ఎలక్ర్టికల్‌-44; ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 03; మెకానికల్- 20 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ (ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. స్టైపెండ్ నెలకు రూ.37,000- నుంచి రూ.1,30,000 చెల్లిస్తారు.

అప్లికేషన్స్​: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.250 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు www.nmdc.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!