HomeJOBSనిజామాబాద్ జిల్లాలో 179 అంగన్వాడీ ఉద్యోగాలు.. అర్హతలు,అప్లికేషన్ లింక్ ఇవే!

నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్వాడీ ఉద్యోగాలు.. అర్హతలు,అప్లికేషన్ లింక్ ఇవే!

నిజామాబాద్ జిల్లాలోని మహిళలకు గుడ్ న్యూస్. జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 179 అంగన్వాడీ టీచర్, ఆయా (హెల్పర్) పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత,ఆసక్తి గల స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి జులై 23 వరకు గడువు ఉంది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు,వయోపరిమితి, అప్లికేషన్ ప్రాసెస్ గురించిన పూర్తి వివరాలు..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 పోస్టుల భర్తీలో భాగంగా, తాజాగా నిజామాబాద్ జిల్లా మొదటి విడత నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్, డిట్పల్లి, నిజామాబాద్ ప్రాజెక్టుల పరిధిలో ఈ నియమకాలు జరగనున్నాయి.

ఖాళీలు, విద్యార్హతలు:
మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అంగన్వాడీ టీచర్ / హెల్పర్: వీటికి ఇంటర్ విద్యార్హత ఉండాలి. ఒకవేళ హెల్పర్ (ఆయా) పోస్టుకు ఇంటర్ చదివిన వారు ఎవరూ అందుబాటులో లేకపోతే.. అప్పుడు టెన్త్ పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.

వయస్సు:
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం అర్హులైన దివ్యాంగ మహిళలు (ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించగలిగే వారు) కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఒక ముఖ్యమైన రూల్ ఉంది. అప్లై చేసుకునే మహిళలు కచ్చితంగా స్థానిక నివాసి అయి ఉండాలి.

గ్రామీణ ప్రాంతం: అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలోనే నివసిస్తూ ఉండాలి. (తండాలు/గూడేలలో అయితే ఎస్టీ మహిళలు, ఎస్సీ వాడల్లో అయితే ఎస్సీ మహిళలకు ఛాన్స్ ఉంటుంది).

పట్టణ ప్రాంతం: సంబంధిత వార్డులో నివసిస్తున్న వారే అర్హులు.

వెయిటేజీ మార్కుల వివరాలు (Total 100 Marks):
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.

ఇంటర్ మార్కులకు: 70% వెయిటేజీ

అనాథలకు: 10% వెయిటేజీ

వితంతువులకు: 5% వెయిటేజీ

దివ్యాంగులకు: 5% వెయిటేజీ

ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూ: 10 మార్కులు

ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు:
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ mis.tgwdcw.in ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఈ కింది డాక్యుమెంట్లు తప్పకుండా అప్‌లోడ్ చేయాలి.

టెన్త్ మెమో

కాస్ట్ సర్టిఫికెట్

ఇంటర్ మార్క్స్ మెమో

రెసిడెన్స్ సర్టిఫికెట్

స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ (సదరం/వితంతు/అనాథ పత్రాలు – వర్తించే వారికి మాత్రమే)

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: జులై 23 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

సర్టిఫికేట్ వెరిఫికేషన్: జులై 27 నుంచి ఆగస్ట్ 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here