వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Warangal) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 39 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు: 39
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు.
టెక్నీషియన్: 14 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్: 11 పోస్టులు
సీనియర్ టెక్నీషియన్: 07 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్: 03 పోస్టులు
సీనియర్ అసిస్టెంట్: 02 పోస్టులు
సూపరింటెండెంట్: 02 పోస్టులు
విద్యార్హతలు: పోస్టును బట్టి విద్యార్హతలు మారతాయి. టెన్త్, ఐటీఐ (ITI), డిప్లొమా, డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
సూపరింటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఫస్ట్ క్లాస్ డిగ్రీ లేదా 50% మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో బీఈ/బి.టెక్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారికి ఇంటర్ (10+2) తో పాటు టైపింగ్ నైపుణ్యం అవసరం.
వయస్సు (08-02-2026 నాటికి):
జూనియర్ అసిస్టెంట్/టెక్నీషియన్ పోస్టులకు గరిష్టంగా 27 ఏళ్లు, సూపరింటెండెంట్/టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 30 ఏళ్లు, సీనియర్ అసిస్టెంట్/సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు 33 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ. 1,12,400 వరకు జీతం (పే లెవల్ 3 నుంచి 6 వరకు) లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1500 + జీఎస్టీ, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులు రూ. 1000 +జీఎస్టీ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 8 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి ?
అభ్యర్థులు NIT వరంగల్ అధికారిక వెబ్‌సైట్ nitw.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పరీక్షా విధానం ,సిలబస్ వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.





