నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT Warangal).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 45 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతను నిర్ణయించారు. అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్లకు చివరి తేదీ డిసెంబర్ 31. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్య వివరాలు :
సంస్థ పేరు- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NIT Warangal).
పోస్ట్ పేరు- ఫ్యాకల్టీ
ఖాళీల సంఖ్య- 45
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
ప్రొఫెసర్ -02
అసోసియేట్ ప్రొఫెసర్ – 08
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ I- 08
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ II -27
అర్హతలు:
ఫ్యాకల్టీ పోస్టులకు (ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పీహెచ్‌డీ తప్పనిసరి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ చేసి ఉండాలి. అంతకు ముందు చేసిన డిగ్రీలలో ఫస్ట్ క్లాస్ సాధించి ఉండాలి.
ప్రత్యేక అర్హత: బీఈ/బీటెక్ తర్వాత నేరుగా పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులే. కానీ.. బ్యాచిలర్ స్థాయిలో ఫస్ట్ క్లాస్ పొంది ఉండాలి.
విభాగాల వారీగా అర్హత:
బయోటెక్నాలజీ: బీఈ / బీటెక్ (బయోటెక్నాలజీ), ఎంఈ /ఎంటెక్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
సివిల్ ఇంజనీరింగ్: బీఈ / బీటెక్ (సివిల్/ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్), ఎంఈ /ఎంటెక్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
కంప్యూటర్ సైన్స్: ఎంఈ /ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ / సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్) అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
మేనేజ్‌మెంట్: ఎంబీఏ/ ఎంకామ్/ఎంటెక్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 35 సంవత్సరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ I పోస్టులకు – 40 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్- 45 సంవత్సరాలు, ప్రొఫెసర్- 50 సంవత్సరాలు ఉండాలి.
అప్లికేషన్లకు చివరి తేదీ: డిసెంబర్ 31 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోడానికి అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కింది దశల ద్వారా జరుగుతుంది.
స్క్రీనింగ్/ షార్ట్‌లిస్ట్: అప్లికేషన్లను పరిశీలించి, నిర్ణీత ప్రమాణాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
సెమినార్ ప్రెజెంటేషన్: షార్ట్‌లిస్ట్‌లొని అభ్యర్థులు టీచింగ్ & రీసెర్చ్ సెమినార్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
వ్యక్తిగత ఇంటర్వ్యూ : ఫైనల్ షార్ట్‌లిస్ట్‌లొ ఎంపికై అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం ఎంపిక కమిటీ ముందు ఆహ్వానిస్తారు.
అప్లికేషన్ విధానం : అభ్యర్థులు NIT వరంగల్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://recruit.nitw.ac.in/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.





