నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు 98 ‘కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. పీజీ పూర్తి చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. నెలకు రూ. 75,000 వరకు జీతం లభించే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 29 జనవరి లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు: 98
సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్: 10 పోస్టులు
కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్: 88 పోస్టులు
విద్యార్హతలు:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి ఉండాలి.
సీనియర్ కన్సల్టెంట్: పంచాయతీ గవర్నెన్స్ లేదా రూరల్ డెవలప్‌మెంట్ రంగంలో కనీసం 9 ఏళ్ల అనుభవం ఉండాలి.
కన్సల్టెంట్: సంబంధిత రంగంలో కనీసం 7 ఏళ్ల అనుభవం అవసరం.
SDGs (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు), GPDP తయారీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు (31.12.2025 నాటికి):
అభ్యర్థుల గరిష్ట వయస్సు 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు నిర్ణీత వేతనంతో పాటు ప్రయాణ ఖర్చులు (Tour TA/DA) ఇస్తారు.
సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు.. నెలకు రూ. 75,000 జీతం ఉంటుంది.
కన్సల్టెంట్ పోస్టులకు.. నెలకు రూ. 60,000 జీతం లభిస్తుంది.
అప్లికేషన్ ప్రక్రియ:
అర్హులైన అభ్యర్థులు NIRDPR అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ nirdpr.org.in లేదా career.nirdpr.in లోకి లాగిన్ అవ్వండి.
- అవసరం అయిన వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
- అనంతరం ప్రింట్ అవుట్ తీసుకోండి.





