వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖకు చెందిన హైదరాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్(NIPHM)లో 202–26 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. (ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధం) అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవాలి.
అర్హతలు–కోర్సు వివరాలు
ఈ కోర్సు 6 నెలలు ఉంటుంది. అనంతరం ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ డిప్లొమా సర్టిఫికేట్ అందజేస్తారు. బీఎస్సీ, ఎమ్మెల్సీ, బీటెక్(అగ్రికల్చర్) ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా కోర్సుకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు ఫీజు రూ.200 చెల్లించాలి. అప్లై చేసేందుకు అక్టోబర్ 31 చివరితేది. వెబ్సైట్ https://niphm.gov.in/pgdphm/index.html





