నైపర్ నోటిఫికేషన్ 2020 ఫార్మాలో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్ )లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్, అహ్మదాబాద్, హాజీపూర్, కోల్‌కతా, మొహాలీ, రాయ్‌బరేలీ, గువాహటి కేంద్రాలలో ఈ కాలేజీలున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలలో ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.
post graduate courses:
ఎంఫార్మసీ, ఎంటెక్ (ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ), ఎంఎస్ (ఫార్మసీ), ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్).ఎంఎస్ ఫార్మసీలో బయో టెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైజ్‌లు, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మా స్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకో ఇన్‌ఫర్మాటిక్స్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎంఫార్మసీలో ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్ స్పెషలైజేషన్లను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.