నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS),హైదరాబాద్ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వివిధ పారామెడికల్, నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT), బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET-2026) ర్యాంక్ ఆధారంగా ఈ ప్రవేశాలు ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు జులై 11 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అందుబాటులో ఉన్న కోర్సులు – సీట్ల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా 3 రకాల కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.
బీఎస్సీ నర్సింగ్ (మహిళలకు మాత్రమే): మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు కాలపరిమితి 4 సంవత్సరాలు.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT): మొత్తం 50 సీట్లు ఉన్నాయి. 4 ఏళ్ల కోర్సుతో పాటు ఒక ఏడాది విధిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది (మొత్తం 5 ఏళ్లు).
బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్: మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఇందులో 3 ఏళ్లు కోర్సు, ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగాల వారీగా సీట్లు:
అనస్టేషియా టెక్నాలజీ (10), డయాలసిస్ థెరపీ (20), కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ (12), ఎమర్జెన్సీ ట్రౌమా కేర్ (10), రేడియోగ్రఫీ & ఇమేజింగ్ (10), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ (12), రెస్పిరేటరీ థెరపీ (10), న్యూరో టెక్నాలజీ (4), పెర్ఫ్యూజన్ టెక్నాలజీ (4), రేడియేషన్ థెరపీ (4), ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ (4) సీట్లు అందుబాటులో ఉన్నాయి.
విద్యా అర్హతలు & వయోపరిమితి:
బీఎస్సీ నర్సింగ్ & అలైడ్ హెల్త్ సైన్సెస్: ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (PCB),ఇంగ్లీష్ సబ్జెక్టులతో.. ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 45% మార్కులు, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 40% మార్కులు ఉండాలి.
బీపీటీ (BPT): ఇంటర్‌లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి లేదా ఒకేషనల్ ఫిజియోథెరపీతో పాటు బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 31 డిసెంబర్ 2026 నాటికి అభ్యర్థికి 17 ఏళ్లు నిండి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌కు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.
ఎంపిక విధానం:
అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ ఈఏపీసెట్-2026 (TG EAPCET-2026)లో అర్హత సాధించి ఉండాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా.. మెరిట్ లిస్ట్ రూపొందించి, నిమ్స్ సంస్థ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తుంది.
ముఖ్యమైన తేదీలు & అప్లికేషన్ విధానం:
ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిమ్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: జులై 11 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని కార్యాలయానికి సమర్పించడానికి చివరి తేదీ: జులై 14
అధికారిక వెబ్‌సైట్ :
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ nims.edu.in సంప్రదించవచ్చు.





