HomeADMISSIONSఫ్యాషన్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి అలర్ట్.. NIFT 2026 దరఖాస్తు గడువు పెంపు

ఫ్యాషన్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి అలర్ట్.. NIFT 2026 దరఖాస్తు గడువు పెంపు

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) క్యాంపస్‌లలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్ల కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజా అప్‌డేట్ ప్రకారం.. నిఫ్ట్ అప్లికేషన్ గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 6 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉండగా.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు అధికారులు ఈ గడువును జనవరి 13 వరకు పొడిగించారు. దీనివల్ల మరికొంతమంది అర్హులైన వారు అప్లై చేసుకునే అవకాశం లభించింది.

దేశవ్యాప్తంగా ఉన్న 20 క్యాంపస్‌లలో యూజీ, పీజీ , పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ వంటి విభిన్న కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసిన వారు యూజీ కోర్సులకు, డిగ్రీ ఉన్నవారు పీజీ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 13 లోపు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పూర్తి చేయాలి. ఫిబ్రవరి 8న ఇందుకు సంబంధించిన రాత పరీక్ష నిర్వహిస్తారు.

అందించే కోర్సులు:

అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des), బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (B.F.Tech). ఇందులో లెదర్ డిజైన్, నిట్వేర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్ వంటి పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులు: మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ (MFM), మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (M.F.Tech).

ఇతర పీహెచ్‌డీ కోర్సులు

అర్హతలు:

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఏదైనా గ్రూపుతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ లేదా మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి.

మాస్టర్స్ కోర్సులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.

వయస్సు (01.08.2026 నాటికి):

యూజీ కోర్సులకు 24 ఏళ్లు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు ఎలాంటి వయస్సు నిబంధన లేదు.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 3,000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.1,500 గా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు:

చివరి తేదీ: జనవరి 13 వరకు (సాధారణ ఫీజుతో) అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

లేట్ ఫీజుతో: జనవరి 14 నుంచి 16 వరకు (రూ. 5000 లేట్ ఫీజుతో) అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం https://exams.nta.nic.in/niftee/ వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here