హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT),2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫ్యాషన్, టెక్నాలజీ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులలో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 6లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 8న ఎంట్రన్స్ నిర్వహిస్తారు.
కోర్సులు & అర్హతలు:
అండర్ గ్రాడ్యుయేట్ (UG)కోర్సులు : ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగిన వారు ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు.
కోర్సులు: ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ, యాక్సెసరీ డిజైన్, నిట్‌వేర్ డిజైన్. (ఈ కోర్సులు విద్యార్థులకు సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయ పడతాయి)
పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో.. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పీజీ కోర్సులకు అర్హులు. ( మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (MFM),మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des),మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (MFTech))
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: అభ్యర్థులు జనవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎంట్రన్స్ టెస్ట్: ఫిబ్రవరి 8, 2026 న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అంతే కాకుండా ఎప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అనంతరం.. ఫిబ్రవరి 8న నిర్వహించే రాత పరీక్ష (CAT – క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్, GAT – జనరల్ ఎబిలిటీ టెస్ట్) రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు తర్వాత రౌండ్లలో సిట్యుయేషన్ టెస్ట్ (UG – డిజైన్), గ్రూప్ డిస్కషన్ / పర్సనల్ ఇంటర్వ్యూ (PG) ఉంటాయి. ఈ అన్ని దశల్లోని మెరిట్ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.nift.ac.in/hyderabad/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.





