గవర్నమెంట్ ఇన్సూరెన్స్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ (క్లాస్ III) కేడర్‌లో ఖాళీగా ఉన్న 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. జులై 18 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. అర్హతలు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ..
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభం: జులై 18 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: ఆగస్టు 07 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఫేజ్-1 పరీక్ష (Prelims):ఆగస్టు 27 ప్రిలిమ్స్ నిర్వహిస్తారు.
ఫేజ్-2 పరీక్ష (Mains): అక్టోబర్ 30 న మెయిన్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది.
అర్హతలు :
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తాము అప్లై చేసుకునే రాష్ట్ర ప్రాంతీయ భాష (తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగు/ఉర్దూ) రాయడం, చదవడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
వయోపరిమితి: కనీసం 21 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
జీతం :ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభ పే స్కేల్ రూ. 36,290 నుంచి రూ. 80,615 వరకు ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో నియమితులైన వారికి అన్ని అలవెన్సులతో కలిపి నెలకు సుమారుగా రూ. 63,000 వరకు జీతం లభిస్తుంది.
ఎంపిక విధానం : అభ్యర్థులను మూడు దశల ద్వారా ఎంపిక చేస్తారు.
ఫేజ్-I: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్)
ఫేజ్-II: మెయిన్స్ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్)
ప్రాంతీయ భాషా పరీక్ష
ఎలా అప్లై చేయాలి?
అర్హత ఆసక్తి గల అభ్యర్థులు NICL అధికారిక వెబ్‌సైట్ nationalinsurance.nic.co.in ఓపెన్ చేసి, రిక్రూట్‌మెంట్ విభాగంలో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.





