నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల కోసం అప్లికేషన్లకు ఇప్పటికే ప్రారంభం అవగా.. ఈ ప్రక్రియ నేటితో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 376 సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఏ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటివరకు అప్లై చేయని అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా .. వెంటనే అధికారిక వెబ్సైట్ (recruitment.nic.in) ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు & విభాగాలు:
మొత్తం 376 పోస్టులను మూడు కీలక విభాగాలకు కేటాయించారు.
కంప్యూటర్ సైన్సెస్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 300 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 26 పోస్టులు
డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: 50 పోస్టులు
విద్యార్హతలు:
సంబంధిత విభాగాల్లో M.Sc, MS, MCA, B.E లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు 2024, 2025 లేదా 2026 సంవత్సరానికి సంబంధించి సంబంధిత పేపర్ కోడ్ (CS, EC, DA) లో వ్యాలిడ్ గేట్ స్కోర్ తప్పని సరిగా ఉండాలి. ఈ పోస్టులకు ఎలాంటి పని అనుభవ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు:
జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.
జీతం వివరాలు:
సెవెన్త్ పే కమిషన్ ప్రకారం ఈ పోస్టులకు లెవెల్-6 పే స్కేల్ వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. దీనికి అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలవెన్సులు లభిస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును ఆన్లైన్ మోడ్ (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్) ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు NIC అధికారిక వెబ్సైట్ recruitment.nic.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి నేడే ఆఖరు తేదీ కాబట్టి.. ఇప్పుడే మీ వివరాలను ఎంటర్ చేసి అప్లై చేసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లను చూపించాల్సి ఉంటుంది.





