భారత ప్రభుత్వ అణుశక్తి శాఖకు చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC)ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. ఏడాది కాంట్రాక్ట్ పద్దతిలో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం మొత్తం 538 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నెలకు రూ. 12,300 వరకు స్టైపెండ్ పొందుతూ, హైదరాబాద్‌లోనే శిక్షణ పొందే అవకాశం ఇది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఖాళీలు, అర్హతలు, స్టైపెండ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 538 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 432 ఖాళీలు
డిప్లొమా ఇంజనీరింగ్ అప్రెంటిస్: 79 ఖాళీలు
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్: 27 ఖాళీలు
విభాగాలు & బ్రాంచీలు:
మెకానికల్, కెమికల్, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ మొదలైన ప్రధాన విభాగాలలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
విద్యా అర్హత: సంబంధిత ట్రేడులు లేదా ఇంజనీరింగ్ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్ వివరాలు:
ఎన్‌ఎఫ్‌సీ నియమాల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల కింది విధంగా స్టైపెండ్ అందిస్తారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: నెలకు రూ. 12,300
డిప్లొమా అప్రెంటిస్: నెలకు రూ. 10,900
ఐటీఐ (సాధారణ ట్రేడులు): నెలకు రూ. 11,040
ఐటీఐ (మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ మొదలైనవి): నెలకు రూ. 10,560
ఎంపిక విధానం:
అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:
ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేయడానికి అన్ని వర్గాల అభ్యర్థులకు ఉచితం.
అప్లికేషన్లకు చివరి తేదీ:
సెప్టెంబరు 16 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లై చేసుకునే విధానం:
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.





