HomeJOBSఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. ఇంకా 4 రోజులే ఛాన్స్

ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. ఇంకా 4 రోజులే ఛాన్స్

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటిషికేషన్ ద్వారా 405 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు- 405

విభాగాల వారిగా పోస్టులు:
ఎలక్ట్రీషియన్ -53
టర్నర్- 35
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -59
వెల్డర్ – 26
ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్- 24
అటెండెంట్ ఆపరేటర్- 23
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్- 19
మెషినిస్ట్ – 17
కార్పెంటర్- 05
ప్లంబర్ – 05
మోటార్ మెకానిక్స్-04
డీజిల్ మెకానిక్-04
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)-03
ల్యాబొరేటరీ అసిస్టెంట్ -01
స్టెనోగ్రాఫర్ -01

ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: నవంబర్ 15 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్: nfc.gov.in

అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు (15-11-2025 నాటికి): అభ్యర్థులు కనిష్ట వయస్సు-18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. (సాధారణంగా OBC అభ్యర్థులకు 28 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 30 సంవత్సరాలు వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక కింది విధానంలో ఉంటుంది.

షార్ట్‌లిస్ట్: NFC ఎంపిక కమిటీ అప్లికేషన్ పరిశీలించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది.

మెరిట్ ఆధారంగా ఎంపిక: ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మినహా ఇతర ట్రేడ్‌ల అభ్యర్థులను వారి క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒకవేళ మార్కులు సమానంగా వస్తే.. టెన్త్ మార్కుల శాతాన్ని టై-బ్రేకర్‌గా పరిగణిస్తారు.

ఇంటర్వ్యూ: ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

అప్లికేషన్ విధానం: అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ (NAPS)అయిన www.apprenticeshipindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

NFC..హైదరాబాద్‌కి సంబంధించిన NAPS Establishment Code: E11153600013 ను ఉపయోగించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు/సర్టిఫికెట్లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here