భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం – నేషనల్ ఎంట్రెన్స్ ఫర్ శ్రేష్ట(ఎన్ఈటీఎస్)–2022 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశంలోని ప్రముఖ ప్రైవేటు రెసిడెన్సియల్ స్కూళ్లలో చదువుకునేందుకు ఎస్సీ స్టూడెంట్లకు అవకాశం కల్పిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఎంట్రెన్స్ ద్వారా ప్రతియేటా సుమారు 3 వేల మందిని ఎంపిక చేస్తారు. వీరికి 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
నెట్స్ రాసేందుకు గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి ఉత్తీర్ణులు 9వ తరగతిలో ప్రవేశానికి, పదో తరగతి ఉత్తీర్ణులు 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతిలో చేరే విద్యార్థులు 12 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు వయసు, పదో తరగతిలో చేరేందుకు 14 ఏళ్ల నుంచి 18ఏళ్లలోపు విద్యార్థులు అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉండాలి.
నెట్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొత్తం 400 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 100 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్ నుంచి 30, సైన్స్ నుంచి 20, సోషల్ సైన్స్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3గంటలు ఉంటుంది.. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించే ఈ పరీక్షలో విద్యార్థులు చేరే దిగువ తరగతి స్థాయి సిలబస్ ఉంటుంది.
ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 12 చివరి తేది.
విద్యార్థి ఫొటో, ఎస్సీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, ఆదాయ దృవీకరణ ప్రతాలు జతచేయాలి. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, అమరావతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాయి. ఎంట్రెన్స్ టెస్ట్ మే 7న నిర్వహిస్తారు.
వెబ్సైట్ : www.shreshta.nta.nic.in