ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్ కోర్సుల్లో ప్రవేశాలకి ఉద్దేశించిన నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్-యూజీ)-2021 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ 2021 రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్ట్ 6వ తేదీ వరకు అప్లికేషన్లు నమోదు చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 12 వ తేదీన నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో దీనిని నిర్వహించనున్నారు.
నీట్ 2021 పరీక్షకు ఎలా నమోదు చేయాలి..
1: విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in క్లిక్ చేయాలి
2: వెబ్‌సైట్‌లో ఇచ్చిన రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
3: దీన్ని క్లిక్ చేసినప్పుడు, క్రొత్త రిజిస్ట్రేషన్ ఎంపికకు వెళ్ళండి. ఈ రిజిస్టర్‌లో మీ మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ సహాయంతో.
4: రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ మీకు మెసేజ్‌గా అందుతుంది.
5: ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
6: అడిగిన సమాచారాన్ని నమోదు చేయండి
7 : ఫోటోను అప్‌లోడ్ చేసి సైన్ చేయండి.
8 : ఫీజు చెల్లించండి.
9: అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
