నీట్ రిజల్ట్స్ 16వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు విడుదల చేయాల్సిన ఫలితాలు సుప్రీం కోర్టు తీర్పుతో వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా నీట్ పరీక్ష రాయలేని విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్ టీఏను ఆదేశించింది. దీంతో అక్టోబర్ 14న కరోనా కారణంతో గైర్హాజరైన విద్యార్థులకు నీట్ 2020 పరీక్ష నిర్వహిస్తారు. ఓవరాల్‌గా అందరి రిజల్ట్స్‌ను 16న డిక్లేర్ చేస్తారు.
సెప్టెంబర్ 13న ఎన్‌టీఏ నిర్వహించిన నీట్ 2020 పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల ఆధారంగా దేశ వ్యాప్తంగా 542 మెడికల్ కళాశాలల్లోని 80,005 సీట్లను భర్తీ చేస్తారు. 313 డెంటల్ కాలేజీలలోని 26,949 సీట్లతో పాటు ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా భర్తీ చేయనున్నారు.
Check NEET Result 2020 – Direct Link (Available on 16th October)