నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్) నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పీజీ -2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
కోర్సులు:
1.ఎండీ/ ఎంఎస్/ పీజీ డిప్లొమా
2.పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ/ ఎన్‌బీఎంఎస్ డిప్లొమా
అర్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ డిగ్రీ/ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం శాశ్వత లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక.
ఎగ్జామ్ ఫీజు: రూ.4250-రూ.3250 చెల్లించాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: నీట్-పీజీ 2022 పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మొత్తం 200 ప్రశ్నలకు 800 మార్కులు ఉంటాయి. సమయం 3.5గంటలు(210 నిమిషాలు) ఉంటుంది. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్ ఏ (క్లినికల్), సెక్షన్ బీ (ప్రీ-క్లినికల్), సెక్షన్ సీ (పారా-క్లినికల్)లో కలిపి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరితేది: 4 ఫిబ్రవరి 2022
హాల్ టికెట్స్ విడుదల: 7 మార్చి 2022
ఎగ్జామ్: 12 మార్చి 2022
రిజల్ట్స్: 31 మార్చి లోపు విడుదల చేసే అవకాశం.
వెబ్సైట్: www.nbe.edu.in
నీట్ పీజీ నోటిఫికేషన్ రిలీజ్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS