మెడికల్ పీజీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది! నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నీట్ పీజీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.కాగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ natboard.edu.in నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 30న ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. కాగా ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరీక్ష తేదీ, కేంద్రాల వివరాలు:
షెడ్యూల్ ప్రకారం.. ఈ నీట్ పీజీ పరీక్షను ఆగస్టు 30న దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం దాదాపు 340 నగరాల్లోని 1,300 కంటే ఎక్కువ పరీక్షా కేంద్రాలను కూడా ఇందుకు ఎంపిక చేశారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT) విధానంలో ఆన్లైన్లో నిర్వహించనున్నారు.
సూచనలు:
పరీక్షా కేంద్రానికి వెళ్లే ప్రతి అభ్యర్థి తప్పని సరిగా అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లాలి. హాల్ టికెట్ లేని ఏ అభ్యర్థిని కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. కాబట్టి చివరి నిమిషం వరకు ఆగకుండా ఇప్పుడే హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని, ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) హాల్ టికెట్‌ను అధికారిక వెబ్సైట్ నుంచి చాలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1.ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లేదా నీట్ అధికారిక వెబ్సైట్ అయిన neet.nta.nic.in ఓపెన్ చేయాలి.
2.హోమ్‌పేజీలో కనిపించే “NEET Admit Card 2026” లేదా “Download Hall Ticket” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత లాగిన్ పేజీలో మీ వివరాలను ఎంటర్ చేయాలి.
మీ అప్లికేషన్ నంబర్
పుట్టిన తేదీ
స్క్రీన్ మీద కనిపించే సెక్యూరిటీ పిన్ లేదా క్యాప్చా కోడ్
అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేశాక “Submit” లేదా “Login” బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ స్క్రీన్ మీద మీ నీట్ హాల్ టికెట్ కనిపిస్తుంది. అందులోని మీ పేరు, ఫోటో, ఎగ్జామ్ సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉండే “Download” లేదా “Print” ఆప్షన్‌ను క్లిక్ చేసి హాల్ టికెట్‌ను పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకొని, ప్రింటవుట్ తీసుకోండి.
గమనిక: పరీక్ష రోజున ఎగ్జామ్ హాల్లోకి వెళ్లడానికి హాల్ టికెట్‌తో పాటు ఒక ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) తీసుకెళ్లడం తప్పనిసరి.





