నీట్ పీజీ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ముందుగా సెప్టెంబర్ 3న ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. ఊహించిన దాని కంటే ముందుగానే ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. నీట్ పీజీ పరీక్షను ఆగస్టు 3వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే.. జనరల్ అభ్యర్థులకు 276/800, జనరల్ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 255, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 235 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. వీటి ఆధారంగా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు.
రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ?
NEET PG 2025 రిజల్ట్‌ను అధికారిక వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ స్టెప్స్ పాటించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లు natboard.edu.in లేదా nbe.edu.in లోకి లాగిన్ అవ్వండి.
2.తర్వాత హోమ్ పేజీలో కనిపించే “NEET PG 2025 Result” లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ లాగిన్ వివరాలను (రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, మొదలైనవి) ఎంటర్ చేయండి.
4.రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటవుట్ తీసుకోండి.
కౌన్సెలింగ్ ప్రక్రియ:
పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. ఈ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC), రాష్ట్ర స్థాయిలో కౌన్సెలింగ్ అధికారులు నిర్వహిస్తారు.
రిజిస్ట్రేషన్: కౌన్సెలింగ్ లో పాల్లొనడానికి ముందుగా అభ్యర్థులు MCC అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఛాయిస్ ఫిల్లింగ్ & లాకింగ్: తర్వాత మీకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకొని లాక్ చేయాలి.
సీట్ అలాట్‌మెంట్: మీ ర్యాంక్, ఛాయిస్‌లు, అందుబాటులో ఉన్న సీట్లు, రిజర్వేషన్ ఆధారంగా సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.
కాలేజీలో రిపోర్టింగ్: అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకొని, నిర్దేశించిన సమయానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో మీకు అలాట్ అయిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి.
కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలోనే MCC విడుదల చేస్తుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేస్తూ ఉండండి.





