దేశం లోని ఎంబీబీఎస్,బీడీఎస్,ఆయూష్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు ఉద్దేశించిన నీట్(యూజీ)-2021 దేశవ్యాప్తం గా సెప్టెంబర్ 12 వ తేదీన జరిగింది. నవంబర్ 1 వ తేదీన ఫలితాలు కూడా వచ్చాయి. సుమారు 16 లక్షల మంది ఈ పరీక్ష రాశారు.దేశంలోనూ,రాష్ట్రాలలోనూ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కానేలేదు. కౌన్సిలింగ్ కోసం విద్యార్థులు,తల్లితండ్రులు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యం లో డిసెంబర్ 10 వ తేదీన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.ఆర్థికం గా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ అంశం పై కోర్టులో విచారణ జరుగుతోంది.
జనవరి 6 తర్వాతే..
నీట్ కౌన్సెలింగ్‌పై తదుపరి విచారణ 2022 జనవరి 6 వ తేదీన ఉండనుందని నోటీస్ లో పేర్కొంది.ఆ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ జనవరి 6 వ తేదీ తర్వాతనే ఉండనుందని అర్థం అవుతోంది.పూర్తి వివరాలు ఎం సీ సీ వెబ్ సైట్ లో చూడవచ్చు.
