మెడిసిన్ సీట్ల భర్తీకి నిర్వహించే నీట్ యూజీ 2026 నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. దరఖాస్తులు ఫిబ్రవరి 08 నుంచి మార్చి 8వ తేదీ వరకు స్వీకరిస్తారు. మే 03 న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశ వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఈ సారి కొత్తగా..
ఈ సారి అభ్యర్థులకు వెరిఫికేషన్ కోసం ఆధార్ వెరిఫికేషన్ తీసుకొచ్చారు. దీంతో పాటు దరఖాస్తు సమయంలో లైఫ్ ఫొటో క్యాప్చర్ చేయనున్నారు. ఆధార్ అడ్రస్ ఆధారంగానే ఎగ్జామ్ సెంటర్లను కేటాయించనున్నారు.
దరఖాస్తు వివరాలు
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ. 1700, ఈడబ్ల్యూఎస్ వారికి రూ. 1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 1000 నిర్ణయించారు. మార్చి 8 రాత్రి 9 గంటల వరకే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏవైనా సందేహాల కోసం 011-40759000, 011-69007700 నంబర్లకు ఫోన్ చేయాలని ఎన్ టీఏ అధికారులు సూచించారు. https://neet.nta.nic.in/





