కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా గందరగోళంగా సాగిన విద్యావ్యవస్థ ఈ ఏడాది గాడిలో పడింది. స్కూళ్లు, కాలేజీలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రకటనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ఇప్పటికే విడుదల చేసింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న నీట్ యూజీ-2023 (NEET UG-2023) పరీక్షకు సంబంధించిన తేదీలు రానే వచ్చాయి.
వైద్య కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2023 వచ్చే ఏడాది మే 7న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. దీంతో అలర్ట్ అయిన విద్యార్థులు తమ కల అయిన డాక్టర్ కోర్సులో చేరడమే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. గతంలో నిర్వహించిన నీట్ పరీక్షల్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనే అనాలిసిస్ను విద్యార్థులు ముందుగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావాలి. 2009 నుంచి 2022 వరకు వరుసగా ప్రతీ ఏడాది ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో తదితర పూర్తి వివరాలు..




నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్!