HomeLATESTఇంటర్​తో ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​లో జాబ్స్​

ఇంటర్​తో ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​లో జాబ్స్​


ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్‌లో చేరాలని కలలు కనే యువతకు అద్భుత అవకాశం నేషనల్​ డిఫెన్స్‌ అకాడమీ అండ్​ నేవల్​ అకాడమీ ఎగ్జామినేషన్. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య డిఫెన్స్‌ అకాడమీల్లో ప్రవేశించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. మరి ఇంటర్‌‌లో మిస్ అయితే.. త్రివిధ దళాల్లో సేవ చేసే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్ ఎగ్జామినేషన్. డిగ్రీ అర్హతతో కేంద్ర సర్వీసుల్లో ఎంట్రీకి మార్గం చూపే సీడీఎస్ నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో సీడీఎస్​ నోటిఫికేషన్, అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్​, ఎగ్జామ్​ టిప్స్​ మీ కోసం..

Advertisement

సీడీఎస్‌ పరీక్షను యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఏటా జనవరి/ ఫిబ్రవరి మరియు నవంబర్‍/ డిసెంబర్‍ లో రెండు సార్లు నిర్వహిస్తుంది. దీని ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్​ అకాడమీ (ఎన్‌ఏ), ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏ), ఆఫీసర్స్ ట్రైనింగ్‍ అకాడమీ (ఓటీఏ)ల్లో సమాన హోదా కలిగిన ఆఫీసర్ ఉద్యోగాల్లో ప్రవేశించవచ్చు. ఈ కోర్సులో త్రివిధ దళాలకు అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు కాగా ఆఫీసర్స్‌ అకాడమీకి షార్ట్‌ సర్వీస్ కమీషన్‌లో మహిళలను కూడా అనుమతిస్తారు. సెలెక్టయితే ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో కెరీర్​ ఆరంభించవచ్చు. ప్రారంభంలోనే అన్ని అలవెన్సులు కలుపుకొని రూ.లక్ష వరకు వేతనాలు అందుకోవచ్చు.

ఫిజికల్​ మెజర్‌‌మెంట్స్‌


ఆర్మీకి దరఖాస్తు చేసేవారు కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. నేవీకి 157, ఎయిర్​ఫోర్స్​కు 162.5, ఆఫీసర్స్​ వుమెన్​ కు 152 సెం.మీ.ఎత్తు తప్పనిసరి. శ్వాస పీల్చినప్పుడు ఛాతి 5 సెం.మీ విస్తరించాలి. ఎయిర్​ఫోర్స్​, నేవీకి దరఖాస్తు చేసినవారికి పైలట్​ ఆప్టిట్యూడ్​ బ్యాటరీ టెస్ట్​ (పీఏబీటీ) నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైనవారు, కళ్లద్దాలు ధరించే అలవాటున్న అభ్యర్థులు ఎయిర్​ఫోర్స్​కు అనర్హులు.

Advertisement

ట్రైనింగ్ ఇలా..


సెలెక్టయిన అభ్యర్థులు దేశ విదేశాల్లో ఎక్కడైనా జాయిన్​ అవ్వాల్సి ఉంటుంది. వారి ప్రాధాన్యతను బట్టి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, గోవాలోని నావల్ అకాడమీ, హైదరాబాద్​లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ మరియు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 18 నెలల పాటు (ఆఫీసర్స్​ ట్రైనింగ్ అకాడమీ వారికి 11 నెలలు) శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో ఫిజికల్​ ఫిట్​నెస్​ కోసం రన్నింగ్​, పుషప్ప్​, సిటప్స్, జంపింగ్, స్కిప్పింగ్, ట్రెక్కింగ్, రోప్​ క్లైంబింగ్​, షూటింగ్​ వంటి అడ్వెంచర్​ ఎక్సర్​సైజ్​లతో పాటు శత్రు దాడిని ఎదుర్కోవడం, అందుకు కావాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు రచించడం, నిరంతరం అప్రమత్తంగా ఉండటం వంటివి నేర్పిస్తారు. నిరంతర అలర్ట్‌గా ఉంటూ దేశ సేవకు పాటు పడాల్సిన కెరీర్ కాబట్టి ట్రైనింగ్ కఠినంగా ఉంటుంది. ఇందుకుగాను అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా సిద్ధమై ఉండాలి. శిక్షణలోనే నెలకు రూ.56 వేలకు పైగా స్టైపెండ్​తో పాటు బుక్స్, యూనిఫామ్, ఇతర అలవెన్సులు లభిస్తాయి. విజయవంతంగా ట్రైనింగ్​ పూర్తిచేసుకున్నవారికి పర్మనెంట్​ కమీషన్‌ ద్వారా ఉద్యోగం ఇస్తారు. 2, 6, 13 సంవత్సరాల్లో కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్​ కల్నల్​ హోదాల్లో ప్రమోషన్ లభిస్తుంది. ఏడాదికి 60 యాన్యువల్​, 20 క్యాజువల్​ లీవ్స్‌ ఉంటాయి. మహిళలకు మెటర్నిటీ, చైల్డ్‌ కేర్, చైల్డ్‌ అడాప్షన్ లీవ్స్‌ అదనం.

రిస్క్‌ ఎక్కువే..

Advertisement


విజయవంతంగా ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న వారిని లెవెల్–10 పే స్కేల్​లో లెఫ్టినెంట్​, సబ్​ లెఫ్టినెంట్​, ఫ్లైయింగ్ ఆఫీసర్​ హోదాలో నియమిస్తారు. ఈ దశలో వేతనాలు రూ.56 వేల నుంచి లక్షా 17 వేల వరకు ఉండే అవకాశం ఉంది. అన్ని వసతులు, రాయితీలతో పాటు పోటీ పరీక్షలు, అడ్మిషన్లలో పదేళ్ల వయోపరిమితి సడలింపు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, స్కాలర్​షిప్​లు, ఉచిత కుటుంబ బీమా, అన్ని రకాల ట్రాన్స్​పోర్ట్​లలో రాయితీ, హయ్యర్ స్టడీస్‌ కి పెయిడ్​ హాలిడేస్​, సులభతర లోన్లు వంటి విస్తృత సదుపాయాలుంటాయి. అయితే ఈ జాబ్​లో ప్రతికూలతలూ ఎక్కువే. సెలవులు దొరక్కపోవడం, కుటుంబానికి దూరంగా దేశం నలుమూలల్లో, విదేశాల్లో ఎక్కడైనా, ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేయాల్సి రావడం, ఎల్లప్పుడూ శారీరక, మానసిక క్రమశిక్షణ కలిగి ఉండటం వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​


రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టేజ్-1లో మూడు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ముద్రిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్టేజ్‍-2 లో సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్‌ చేస్తుంది. నెగెటివ్​ మార్కులున్నాయి. 0.33 శాతం కోత విధిస్తారు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో పదోతరగతి స్థాయిలో ప్రశ్నలిస్తుండగా మిగిలిన సబ్జెక్టుల్లో డిగ్రీ లెవెల్‌ క్వశ్చన్స్‌ వస్తాయి.

Advertisement

ఎగ్జామ్​ ప్యాటర్న్​:


మిలిటరీ, నేవీ, ఎయిర్‍ఫోర్స్
:


సబ్జెక్ట్​ సమయం మార్కులు

Advertisement


ఇంగ్లిష్‍ 2 గంటలు 100


జనరల్‍ నాలెడ్జ్ 2 గంటలు 100


ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 గంటలు 100

Advertisement


ఆఫీసర్స్ ట్రైనింగ్‍ అకాడమీ:


ఇంగ్లిష్‍ 2 గంటలు 100


జనరల్‍ నాలెడ్జ్ 2 గంటలు 100

Advertisement

ఇంగ్లిష్


అభ్యర్థి బేసిక్ ఇంగ్లిష్ నాలెడ్జ్​ను పరీక్షిస్తారు. గ్రామర్‍, ఆంటోనిమ్స్, సిననిమ్స్, ఆర్టికల్స్, వాయిస్‍, ప్రిపొజిషన్స్, టెన్సెస్, కాంప్రహెన్సన్, వంటి వాటి నుంచి డిగ్రీ స్టాండార్డ్​లో ప్రశ్నలిస్తారు. ఇంగ్లిష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం వల్ల వొకాబులరీ పెంచుకోవచ్చు. రోజుకు కొన్ని కొత్త పదాలు వాటిని ఉపయోగించి వాక్యాలు సాధన చేయాలి. డిక్షనరీ సహాయంతో చదివితే త్వరగా నేర్చుకోవచ్చు. రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం ఇందుకు ఉపకరిస్తుంది.


జనరల్‍ నాలెడ్జ్​

Advertisement


జీకే విభాగంలో కరెంట్​ అఫైర్స్​తో పాటు జియోగ్రఫీ, చరిత్ర, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, కెమిస్ర్టీ, ఫిజిక్స్, సైన్స్ అండ్‍ టెక్నాలజీ టాపిక్​ల నుండి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలిస్తారు. నిత్యజీవితానికి దగ్గరగా ఉన్నవి, నిత్యం గమనిస్తూ ఉన్న అంశాలే ప్రశ్నలవుతాయి. వీటికి అదనంగా స్టాండర్డ్​ జీకే టాపిక్స్ అయిన దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి వాటినీ వదలకూడదు. ప్రీవియస్‍ పేపర్ల సహాయంతో ఏ సబ్జెక్టు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయో గుర్తించి క్షుణ్నంగా చదవగలిగితే ఇందులో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకు ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 పదోతరగతి పుస్తకాల్లో ఉండే చాప్టర్లు చాలా ఉపయుక్తం


ఎలిమెంటరీ మ్యాథ్స్


మ్యాథ్స్​లో పదో తరగతి స్టాండర్డ్​ ప్రశ్నలు వస్తాయి. నంబర్‍ సిస్టమ్స్, ఇంటిజర్స్​, వోల్‍ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధం, బేసిక్‍ ఆరిథ్‍మెటిక్‍ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్లు, టేబుల్స్, గ్రాఫ్‍లు, మెన్సురేషన్, కాలం-దూరం, నిష్పత్తి-కాలం, కాలం-పని వంటి టాపిక్స్​ బాగా చూసుకోవాలి. ఆర్‍ఎస్‍ అగర్వాల్‍ క్వాంటిటేటివ్​ యాప్టిట్యూడ్​, ఆబ్జెక్టివ్ అర్థమెటిక్, ఎన్​సీఈఆర్​టీ పుస్తకాల్లో ఉన్న మోడల్స్​ బాగా సాధన చేయాలి. ప్రీవియస్‍ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్‍ ప్యాటర్న్ తెలిసి ప్రిపరేషన్​ సులువవుతుంది. ఎగ్జామ్​కు ముందు కొన్ని ఆన్​లైన్​ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకుంటే మంచిది.

Advertisement


ఇంటర్వ్యూ


ఇందులో రెండు దశల్లో సైకోమెట్రిక్ టెస్టులు నిర్వహిస్తారు. మొదటి దశలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్​ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ డిస్ర్కిప్షన్ టెస్ట్ ఉంటుంది. వీటిలో క్వాలిఫై అయితే రెండోదశలో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్​ ఆఫీసర్‌‌ టాస్క్స్, సైకాలజీ టెస్ట్స్‌ కండక్ట్‌ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ టెస్టుల్లో ఏదైనా సందర్భానికి అభ్యర్థి స్పందన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటారు. ఇందుకుగాను భయం, జంకు లేకుండా ఎవరి ముందైనా మాట్లాడేలా సాధన చేయాలి. ఏదైనా టాపిక్​ను ప్రిపేరయి సొంతంగా స్పీచ్​ ఇవ్వడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్​ పెంచుకోవాలి. ఇంగ్లిష్​లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. న్యూస్​, ఇతర చర్చలు వింటూ ఎప్పుడు, ఎలా మాట్లాడుతున్నారో గమనించాలి. వొకాబులరీ పెంచుకుంటూ సాధన చేస్తే సులువుగా నేర్చుకోవచ్చు. నిరంతరం మాట్లాడుతుంటం వల్ల గ్రూప్​ డిస్కషన్‌ను​ కూడా ఎదుర్కోవచ్చు.
యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)..149వ కోర్సు నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ), 111వ ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ కోర్సుల్లో(ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత‌ పురుష‌ అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

నోటిఫికేషన్​


మొత్తం ఖాళీలు: 400


1) నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ): 370 (ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్‌-120)


2) నావ‌ల్ అకాడ‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌): 30


అర్హత‌: ఆర్మీ వింగ్ పోస్టుల‌కి ఇంట‌ర్మీడియ‌ట్ (10+2)/ త‌త్సమాన ఉత్తీర్ణత‌. ఎయిర్ ఫోర్స్‌, నేవ‌ల్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ (10+2) ఉత్తీర్ణ‌త‌. ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.


వ‌యసు: 2003 జులై 2 – 2006 జులై 1 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.


తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: అనంతపూర్‌, హైద‌రాబాద్‌, తిరుపతి, విశాఖ‌ప‌ట్నం.


ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


చివ‌రి తేది: 11 జనవరి 2022.


ఎగ్జామ్​: 10 ఏప్రిల్​ 2022.
కోర్సు ప్రారంభం: 2 జనవరి 2023
వెబ్​సైట్: www.upsc.gov.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!