నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) పలు పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మే 1వ తేదీతో అప్లికేషన్ గడువు ముగియనుంది. ఇదిలా ఉంటే.. HEMM ఆపరేటర్, పారామెడికల్ స్టాఫ్ , ఓవర్సీర్ వంటి 577 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హత నిర్ణయించారు. టెన్త్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
NCL రిక్రూట్మెంట్ 2026- పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు : 577
HEMM ఆపరేటర్ (ట్రైనీ): 472 పోస్టులు (డంపర్, డోజర్, గ్రేడర్ ఆపరేటర్లు).
పారామెడికల్ స్టాఫ్: స్టాఫ్ నర్స్ (47), ఫార్మాసిస్ట్ (4), టెక్నీషియన్ (పాథాలజీ, డెంటల్, రేడియోగ్రాఫర్) వంటి పోస్టులు.
ఓవర్సీర్ (సివిల్): 30 పోస్టులు.
అర్హతలు :
పోస్టును బట్టి అర్హతలు మారుతుంటాయి.
HEMM ఆపరేటర్: టెన్త్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు వాలిడ్ HMV (Heavy Motor Vehicle) ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ తప్పనిసరి.
స్టాఫ్ నర్స్: ఇంటర్, బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ (GNM) డిప్లొమా చేసి ఉండాలి.
ఓవర్సీర్: సివిల్ ఇంజనీరింగ్‌లో 3 ఏళ్ల డిప్లొమా ఉండాలి.
ఇతర పారామెడికల్ పోస్టులు: సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ తప్పనిసరి.
వయస్సు:
అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు.
జీతం :
HEMM ఆపరేటర్: రోజుకు రూ. 1,502.66 (సుమారు నెలకు రూ. 45,000 పైగా) జీతం ఉంటుంది.
స్టాఫ్ నర్స్, ఓవర్సీర్: నెలకు బేసిక్ పే రూ.47,330.25తో ప్రారంభమవుతుంది. అదనంగా అలవెన్సులు కూడా ఇస్తారు.
ఎంపిక :
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: 100 మార్కులకు 90 నిమిషాల పాటు పరీక్ష జరుగుతుంది. ఇందులో నెగటివ్ మార్కింగ్ లేదు.
సిలబస్: ఆపరేటర్ పోస్టులకు జనరల్ పేపర్ ఉంటుంది. పారామెడికల్ , ఓవర్సీర్ పోస్టులకు టెక్నికల్ సబ్జెక్ట్ (70 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (30 మార్కులు) ఉంటాయి.
చివరి దశ: పరీక్షలో మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
అప్లికేషన్లకు చివరి తేదీ: మే 01 వ తేదీ రాత్రి 11:59 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకునే విధానం :
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ nclcil.in లోని ‘Career’ సెక్షన్‌కు వెళ్లాలి.
2.అక్కడ ‘Recruitment’ విభాగంలో నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
3.ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.





