నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 173 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆసక్తి గల వారు జనవరి 30 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు 2026:
NCERT ప్రకటించిన ఈ 173 ఖాళీలలో గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C విభాగాలలో వివిధ రకాల నాన్-అకడమిక్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్ వంటి కీలక పోస్టులను భర్తీ చేస్తున్నారు.
సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులు: అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ICTలో M.Tech/B.Tech చేసి అనుభవం ఉన్నవారు అర్హులు.
ప్రొడక్షన్ ఆఫీసర్ పోస్టులు: అభ్యర్థులకు ప్రింటింగ్ టెక్నాలజీలో డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
బిజినెస్ మేనేజర్ పోస్టులు: అభ్యర్థులు ఎంబీఏ లేదా మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్ (గ్రేడ్-A): ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా మాస్టర్స్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
అప్లికేషన్ చివరి తేదీ: అభ్యర్థులు జనవరి 30 వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ముందుగా NCERT అధికారిక వెబ్‌సైట్ ncert.nic.in లోకి లాగిన్ అవ్వాలి.
హోమ్ పేజీలో ‘Recruitment’ సెక్షన్‌కు వెళ్లి సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి.
అవసరమైన వివరాలతో రిజిస్టర్ చేసుకుని.. అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.





