నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 173 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హత నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 1వరకు అప్లై చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అధికారిక వెబ్ సైట్ ncert.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
మొత్తం 173 పోస్టులను మూడు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ A (Group A): 138 పోస్టులు
గ్రూప్ B (Group B): 26 పోస్టులు
గ్రూప్ C (Group C): 09 పోస్టులు
రిజర్వేషన్ల వారీగా చూస్తే.. జనరల్ (UR) – 86, SC – 14, ST – 18, OBC – 44, EWS – 11 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
విద్యార్హతలు:
పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. సాధారణంగా టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
వయస్సు: 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి గరిష్ట వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు 7వ కేంద్ర వేతన సంఘం (7th CPC) సిఫార్సుల మేరకు జీతం ఇస్తారు. గ్రూప్ A అధికారులకు నెలకు దాదాపు లక్ష రూపాయలకు పైగా జీతం లభించే అవకాశం ఉంది. ఇతర గ్రూప్ పోస్టులకు కూడా ఆకర్షణీయమైన పే-స్కేల్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 27 వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: జనవరి 16, 2026 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
పోస్టులను బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం :
1.మొదట NCERT అధికారిక వెబ్‌సైట్ ncert.nic.in లోకి లాగిన్ అవ్వండి.
2. ‘Vacancies’ మెనూలో ‘Non-Academic’ విభాగంలో ఉన్న నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి.
3.మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
4.అనంతరం విద్యార్హతలు, అడ్రస్, ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
5. పోస్టును బట్టి నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
6. చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేసి.. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.





