నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ స్కూళ్లలో మొత్తం 1616 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జులై 27 వరకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకునేందుకు గడువు నిర్ణయించింది.
పోస్టులు: ప్రిన్సిపల్– 12,
పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు)–397,
టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు)– 683,
టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్)– 343,
మిసిలీనియస్ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్)– 181.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా జులై 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: ప్రిన్సిపల్ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1800, టీజీటీ, మిస్‌లీనియస్ కేటగిరీ టీచర్ పోస్టులకు రూ.1500 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం www.navodaya.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.
నవోదయ స్కూల్స్‌లో 1616 టీచింగ్ జాబ్స్‌కు నోటిఫికేషన్
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
LATEST
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





