దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో అడ్మిషన్స్‌కు సంబంధించి ‘జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025’ అప్లికేషన్ గడువు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న జరుగనుంది. ఫలితాలు మార్చి నెలలో వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ 23వరకు గడువు ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.