HomeADMISSIONSజవహార్ నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు.. నోటిఫికేషన్ విడుదల

జవహార్ నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు.. నోటిఫికేషన్ విడుదల

జవహర్ నవోదయ విద్యాలయ (JNV) 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల 31 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్ 28న దేశ వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫలితాలను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విడుదల చేస్తారు. కేంద్ర విద్యా శాఖ పరిధిలో పనిచేసే ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) సీటు సాధిస్తే.. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత వసతితో కూడిన నాణ్యమైన సీబీఎస్‌ఈ (CBSE)చదువు లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ లో అప్లికేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి ఈ నెల 31ని చివరి తేదీగా నిర్ణయించారు. అప్లై చేసుకున్న విద్యార్థులకు ఈ ఏడాది నవంబర్ 28వ తేదీన దేశ వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష (JNVST)నిర్వహిస్తారు. అనంతరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఫలితాలను విడుదల చేసి, మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.

వయోపరిమితి, అర్హతలు:
ఈ ప్రవేశ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఖచ్చితంగా 2015 మే 1 నుంచి 2017 జులై 31 మధ్య జన్మించి ఉండాలి. ఈ రెండు తేదీల్లో పుట్టిన వారు కూడా అర్హులే. దీనితో పాటు విద్యార్థి ప్రస్తుతం సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. ఒక జిల్లాలోని నవోదయ విద్యాలయానికి అప్లై చేయాలంటే, విద్యార్థి అదే జిల్లాలో 5వ తరగతి చదువుతుండటం తప్పనిసరి.

ఎంపిక విధానం, సీట్ల కేటాయింపు:
దేశవ్యాప్తంగా మొత్తం 665 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ , రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. నవోదయ నిబంధనల ప్రకారం మొత్తం సీట్లలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, మిగిలిన 25 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. అలాగే.. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ,దివ్యాంగులకు రిజర్వేషన్లు ఉంటాయి. మొత్తం సీట్లలో కనీసం ఒక వంతు సీట్లను బాలికలకు కేటాయించడం జరుగుతుంది.

అప్లికేషన్ ప్రక్రియ:
అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే సమయంలో విద్యార్థి ఫోటో, సంతకం, తల్లిదండ్రుల సంతకంతో పాటు ప్రస్తుతం చదువుతున్న స్కూల్ హెడ్‌మాస్టర్ ధృవీకరించిన సర్టిఫికేట్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here