విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్.. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 320 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. జనవరి 2 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. ఆన్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు- నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్, విశాఖపట్నం
పోస్ట్ పేరు- అప్రెంటిస్
మొత్తం ఖాళీలు- 320
ట్రేడ్‌ల వారిగా ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న అప్రెంటిస్ పోస్టులు ట్రేడ్‌ల వారీగా ఖాళీలు..
మెకానిక్ డీజిల్-32
మెషినిస్ట్ – 12
మెకానిక్ – 6
ఫౌండ్రీమ్యాన్ – 3
ఫిట్టర్ – 60
పైప్ ఫిట్టర్ – 30
ఎలక్ట్రీషియన్ – 35
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 5
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ -17
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 20
షీట్ మెటల్ వర్కర్ – 30
షిప్‌రైట్ – 30
పెయింటర్ -15
మెకానిక్ మెకట్రానిక్స్ – 10
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -15
విద్యార్హత: అభ్యర్థులు ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 14-18 సంవత్సరాల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది)
అప్లికేషన్ చివరి తేదీ: అభ్యర్థులు జనవరి 2, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: joinindiannavy.gov.in
ఎంపిక విధానం: అభ్యర్థులను ఈ క్రింది ప్రక్రియ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష / ఆన్‌లైన్ టెస్ట్
స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్
స్టైఫండ్ : ‘ది అప్రెంటిస్ యాక్ట్ 1961’ నిబంధనల ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9,600 నుంచి రూ. 10,560 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు.
అప్లికేషన్ విధానం: అర్హులైన అభ్యర్థులు నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత “Apprentices Recruitment 2025” నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి.. “Apply Online” సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి. అప్లికేషన్ కోసం అవసరమైన వివరాలతో ఎంటర్ చేయండి. తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.






Tour Script