HomeLATESTఫార్మసీ కోర్సులకు నైపర్ - జేఈఈ 2022 నోటిఫికేషన్

ఫార్మసీ కోర్సులకు నైపర్ – జేఈఈ 2022 నోటిఫికేషన్

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్‌) 2022 విద్యాసంవత్సరానికి నైపర్‌ జేఈఈ-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఫార్మసీ విద్యలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్​ కల్పిస్తారు. 2022 సంవత్సరానికి గాను ఈ పరీక్షను నైపర్‌, హైదరాబాద్‌ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మే 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

కోర్సులు: ఎంఫార్మసీ, ఎంఎస్‌ (ఫార్మా), ఎంటెక్‌ (ఫార్మా), ఎంబీఏ (ఫార్మా), పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నైపర్‌ అహ్మదాబాద్‌, గువహటి, హాజీపూర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్‌ నగర్‌ క్యాంపస్​లలో ఈ కోర్సులు అడ్మిషన్స్​ కల్పిస్తున్నాయి. బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ త‌దిత‌రాలు విభాగాలు ఉన్నాయి.

అర్హత: ప్రోగ్రాములని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, మాస్టర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. జీప్యాట్/ గేట్‌/ నెట్‌ జాతీయ పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మే 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పరీక్ష జూన్​ 12వ తేదీన నిర్వహిస్తారు.

పూర్తి వివరాల కోసం www.niperhyd.ac.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!