రక్షణ రంగంలో సేవ చేయాలనుకునే నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. డిఫెన్స్‌లో రెండు ముఖ్యమైన నోటిఫికేషన్లని రిలీజ్ చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్(1) నోటిఫికేషన్స్ విడుదల చేసింది.ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో 2022 జనవరి 11 వ తేదీ వరకు అప్లై చేయొచ్చు.
కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్
డిఫెన్స్‌కు సంబంధించి మరో ముఖ్యమైన కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(1) నోటిఫికేషన్ కూడా యూపీఎస్సీ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2022 జనవరి 11 వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.పై రెండు నోటిఫికేషన్ లకి సంబంధించిన రాత పరీక్షలు 2022 ఏప్రియల్ 10 వ తేదీన జరగనున్నాయి.పూర్తి వివరాలు యూపీఎస్సీ వెబ్ సైట్ లో చూడవచ్చు.
వెబ్సైట్: www.upsc.gov.in