నాగర్‌కర్నూల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 255 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్లు కోరుతున్నారు. టీచర్ పోస్టులకు ఇంటర్, హెల్పర్ పోస్టులకు ఇంటర్ లేదా టెన్త్ అర్హత ఉండాలి. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాజెక్టుల వారీగా వివరాలు:
జిల్లా వ్యాప్తంగా మొత్తం 255 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 148 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 107 అంగన్వాడీ ఆయా/హెల్పర్ (AWH) పోస్టులు ఉన్నాయి.
ఈ ఖాళీలు జిల్లాలోని ఐదు ప్రధాన ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అందుబాటులో ఉన్నాయి.
అచ్చంపేట: 77 పోస్టులు (36 AWT + 41 AWH)
బల్మూర్: 64 పోస్టులు (36 AWT + 28 AWH)
కల్వకుర్తి: 38 పోస్టులు (21 AWT + 17 AWH)
కొల్లాపూర్: 34 పోస్టులు (22 AWT + 12 AWH)
నాగర్‌కర్నూల్: 42 పోస్టులు (33 AWT + 9 AWH)
విద్యార్హత, వయోపరిమితి వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే మహిళా అభ్యర్థులు నిర్దిష్టమైన విద్యార్హతలను కలిగి ఉండాలి.
అంగన్వాడీ టీచర్ (AWT) : అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్/ఆయా (AWH): ఇంటర్ అర్హత గల అభ్యర్థులు అందుబాటులో లేకపోతే టెన్త్ పాసైన అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 01.07.2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అప్లికేషన్ విధానం:
ఈ పోస్టులకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
చివరి తేదీ:
సెప్టెంబర్ 7 నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ wdcw.tg.nic.in సంప్రదించవచ్చు.





