నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్)లో వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు చివరి తేది. నవంబర్ 30.
పోస్టుల వివరాలు
రూరల్ డెవెలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్‌లో 85 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ లీగల్–02, అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ సర్వీస్–04 పోస్టులు. మొత్తం 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు జనరల్ చార్డెట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్, కంప్యూటర్/ఐటీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ప్లాంటేషన్ అండ హార్టికల్చర్, ఫిషరీస్, పుడ్ ప్రాసెసింగ్, ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మీడియా స్పెషలిస్ట్, ఎకనామిక్స్, అసిస్టెంట్ మేనేజర్. విభాగాల్లో ఉన్నాయి.
అర్హతలు..
ఆర్డీబీఎస్ పోస్టులకు ఏదైనా విభాగంలో కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, బీబీఏ, బీఎంఎస్, ఎంబీఏ, లీగల్ పోస్టులకు కనీసం 60శాతం మార్కులతో ఎల్ఎల్బీ ఉత్తీర్ణులవ్వాలి. ప్రోటోకాల్, సెక్యూరిటీ పోస్టులకు ఆర్మీ లేదా నేవీలో ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 35–40 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్
మూడు ఫేజ్‌ల్లో ఆన్లైన్ పరీక్షలు, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంపార్టెంట్ తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం :08–11–2025
దరఖాస్తులకు చివరి తేదీ: 30–11–2025
ఫేజ్1 ఆన్లైన్ పరీక్ష: 20.12.2025
ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష : 25.01.2025
వెబ్సైట్ : https://www.nabard.org/





